అంబేడ్కర్ విగ్రహం తొలగింపు
కొడంగల్ రూరల్: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా సోమవారం అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు విగ్రహాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో భద్రపర్చినట్లు అంబేడ్కర్ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు యూ.రమేష్‌బాబు, పట్టణ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ ఎం.కృష్ణంరాజు తెలిపారు. పనులు ముగిశాక విగ్రహాన్ని అక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి రమేష్, కార్యదర్శి రాము, వెంకటేశం, జి.జగన్‌మోహన్, డీవీఎంసీ మెంబర్ దస్తప్ప, జి.రాములు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో భాగంగా నేతల నిర్ణయం
ఎంపీడీఓ కార్యాలయానికి తరలింపు
పనులు పూర్తయ్యాక అక్కడే ఏర్పాటు చేస్తామని వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment