బొంరాస్‌పేట: మినీ మేడారం జాతరగా పేరుగాంచి పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సోమవారం కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లపై ఆలయ కమిటీ చైర్మన్ జయరాములు, కమిటీ సభ్యులతో చర్చించారు. తాగునీరు, స్నానపు గదులు, మరుదొడ్ల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
సీఎం రాకకు సిద్ధం
ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిడే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు రానున్న నేపథ్యంలో హెలీపాడ్, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట తాండూరు సబ్–కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఎల్‌పీఓ శంకర్‌నాయక్, డీఎస్పీ శ్రీనివాస్, కడా అధికారి వెంకట్‌రెడ్డి, ఆలయకమిటీ సభ్యులు వెంకటయ్యగౌడ్, రాములు, యాదయ్య ఉన్నారు.
పనులు వేగవంతగా పూర్తి చేయాలి
కలెక్టర్ ప్రతీక్‌జైన్
Comments
Please login to add a commentAdd a comment