
కదలని ఖాకీలు
బదిలీలకు
తాండూరు: తాండూరు సబ్ డివిజన్ పరిధిలో మూడు నెలలుగా నేరాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వరుస దొంగతనాలు, తగాదాలతో శాంతిభద్రతలు లోపించాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పట్టణంలో వరుస దొంగతనాలు జరిగి పదిరోజులు గడిచినా ఒక్క కేసును ఛేదించకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ చోరీల్లో అరకోటికి పైగా విలువైన బంగారు ఆభరణాలు, నగదు అపహరణకు గురైంది. మరోవైపు తాండూరు సబ్ డివిజన్ పరిధిలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలపై అవినీతి ఆరోపణలు రావడంతో ఐజీ బదిలీ ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో ఒక సీఐ మినహాయిస్తే మిగిలిన ముగ్గురు తాండూరు సబ్ డివిజన్ పరిధిలోనే విధులు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా ఇక్కడే..
తాండూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలు ఇసుక అక్రమ రవాణా కట్టడి, రేషన్ బియ్యం అక్రమ రవాణాల అరికట్టకపోవడం.. వీటి వెనుక పోలీసు అధికారుల ప్రత్యక్ష, పరోక్ష సహకారం ఉందని ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. గతేడాది అక్టోబర్ 3న ఐజీ వి.సత్యనారాయణ వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తాండూరు రూరల్ సీఐ అశోక్‌కు స్థానచలనం కల్పించగా.. టౌన్ సీఐ సంతోశ్ మాత్రం ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. యాలాల ఠాణాలో విధులు నిర్వహిస్తున్న శంకర్‌ను బషీరాబాద్ పీఎస్‌కు, పెద్దేముల్ ఎస్‌ఐ గిరిని యాలాల పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. తాండూరు పట్టణ ఠాణాలో రెండు నెలల క్రితం విధుల్లో చేరిన ఎస్‌ఐ భరత్ రెడ్డి నెలరోజులకే ఎస్‌హెచ్‌ఓ కోసం దుద్యాల పీఎస్‌కు బదిలీ చేయించుకున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో బషీరాబాద్ ఎస్‌ఐగా పనిచేస్తున్న రమేశ్‌పై వచ్చిన ఆరోపణల మేరకు ఆయన్ను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ప్రస్తుతం తాండూరు టౌన్ ఎస్‌ఐగా బాధ్యతలు అప్పగించారు. దీంతో సబ్ డివిజన్ పరిధిలో నలుగురు ఎస్సైలు వివాదాలను ఎదుర్కొంటున్నవారే ఉన్నారనే చర్చలు వినిపిస్తున్నాయి.
నిద్దరోతున్న నిఘా నేత్రం
తాండూరు టౌన్ పీఎస్ పరిధిలో శాంతి భద్రత పరిరక్షణకు ఏడాదిన్నర క్రితం ప్రభుత్వం సీడీపీ నిధుల నుంచి రూ.25 లక్షలు మంజూరు చేసి సీసీ కెమెరాలు, సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేయించింది. వీటి నిర్వహణ విషయంలో పోలీసు అధికారులు అలసత్వం ప్రదర్శించారనే విమర్శలున్నాయి. మూడేళ్ల క్రితం ఇక్కడ విధులు నిర్వహించిన పోలీసులు అధికారులు మేము సైతం, నేను సైతం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లోనూ ఏర్పాటు చేయించారు. కానీ చోరీకి పాల్పడిన దొంగలు చిక్కక పోవడంతో అసలు నిఘానేత్రాలు పనిచేస్తున్నాయా లేదా అనే అనుమానాలకు తావిస్తోంది.
సరిపడా లేని సిబ్బంది
అవినీతి ఆరోపణల నేపథ్యంలో ట్రాన్స్‌ఫర్స్
ఉత్తర్వులు వచ్చినా సబ్ డివిజన్ పరిధిలోనే విధులు
పది రోజులు గడిచినా నిందితులను పట్టుకోని వైనం
మరోవైపు వరుస చోరీలు
తాండూరు సబ్ డివిజన్ పోలీసు అధికారులపై సర్వత్రా విమర్శలు
తాండూరు సబ్ డివిజన్ పరిధిలో తాండూరు పట్టణం, తాండూరు రూరల్ సర్కిలున్నాయి. పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఒక సీఐ ఉండగా రూరల్ పరిధిలోని కరన్‌కోట్ పోలీస్ స్టేషన్‌లో మరో సీఐ విధులు నిర్వహిస్తున్నారు. రూరల్ సర్కిల్ పరిధిలో పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, కరన్‌కోట్ పోలీస్ స్టేషన్‌లకు ఎస్‌హెచ్‌ఓలుగా ఎస్‌ఐలు కొనసాగుతున్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్‌కు రెండు చొప్పున ఎస్‌ఐ పోస్టులుండగా ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు కానిస్టేబుల్స్ పోస్టులు సైతం ఖాళీగానే ఉన్నాయి.

కదలని ఖాకీలు
Comments
Please login to add a commentAdd a comment