
ప్రజావాణికి 98 ఫిర్యాదులు
అనంతగిరి: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా మొత్తం 98 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన ప్రతీ దరఖాస్తును పరిశీలించాలని, తమ పరిధిలో ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, ఆర్‌డీఓ వాసుచంద్ర, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలి
టెలికాం డీజీఎం ప్లానింగ్ అధికారులకుచేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి వినతి
బంట్వారం: వికారాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న బీఎస్‌ఎన్‌ఎల్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చేవేళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్ టెలికాం డీజీఎం ప్లానింగ్ అధికారులను కలిసి కోట్‌పల్లి, వికారాబాద్ మండలాలకు సంబంధించిన బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ నియోజకవర్గంలోని మోత్కుపల్లి, మైలార్ దేవరాంపల్లి, పీలారం, ధర్మపురం, కంకణాలపల్లి, నర్సాపూర్, బార్వాద్, కరీంపూర్, జిన్నారం, బీరోల్ తదితర గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ సమస్యతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులకు వివరించారు. సమస్యను సత్వరమే పరిష్కరించి వినియోగదారులకు బీఎస్‌ఎన్‌ఎల్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ విషయంపై అధికారులు సానుకూలంగా స్పందించారు.
యాలాల ఎంఈఓ బాధ్యతల స్వీకరణ
యాలాల: నూతన మండల విద్యాధికారిగా జుంటుపల్లి జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం రమేశ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఎంపీడీఓ పుష్పలీలకు తాఖీదులు అందజేసిన ఆయన ఎమ్మార్సీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా విద్యాభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ యాదయ్య, తహసీల్దార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
సన్మానం
మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశంలో నూతన ఎంఈఓ రమేశ్, యాలాల కాంప్లెక్స్ హెచ్‌ఎం సిద్దరామేశ్వర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మీకాంతరావు, జిల్లా బాధ్యులు నరహరిరెడ్డి చంద్రశేఖర్, జనార్దన్‌రెడ్డి, హన్మప్ప, భారతి, శ్రీశైలం, నరేశ్, గోపాల్, శశిధర్, సతీదేవి, శాంతి ఉన్నారు.
నేటి నుంచి ల్యాడర్ సర్వే
కొడంగల్ రూరల్: సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ పరిధికి సంబంధించి అధికారులు మార్కింగ్ వేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. మున్సిపల్‌కు సంబంధించి నక్ష ఏర్పా టు చేసేందుకు ల్యాడర్ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం నుంచి చేపట్టనున్న సర్వేలో మున్సిపల్‌కు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. భారతదేశంలో 152 పట్టణ సంస్థలు(యూఎల్‌బీ) పైలెట్ టౌన్ సర్వే ప్రోగ్రాంకు ఎంపికయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో పది పట్టణ స్థానిక సంస్థలు ఎంపిక కాగా ఇందులో కొడంగల్ ఒకటి అని చెప్పారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రతీ అంగుళం భూమిని జియో కార్డినేట్స్ సాయంతో సర్వే చేయున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజావాణికి 98 ఫిర్యాదులు

ప్రజావాణికి 98 ఫిర్యాదులు
Comments
Please login to add a commentAdd a comment