
సంత్ సేవాలాల్ సేవలకు సలాం
తెలంగాణకు పున్నమి చంద్రుడు
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు సోమవారం వికారాబాద్‌లో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మొక్కలు నాటారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని ధన్నారం వద్ద యజ్ఞ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భారీ కేక్ కట్‌చేశారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చీకటిలో ఉన్న తెలంగాణకు పున్నమి చంద్రుడు ఆత్మగల్ల కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. – అనంతగిరి
అనంతగిరి: బంజారాలను చైతన్యం చేయడంలో సంత్ సేవాలాల్ చేసిన సేవలు మరువ లేనివని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంత్యుత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్‌జైన్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సేవాలాల్ బోధనలు పాటిస్తూ సమాజ సేవకకు తోడ్పాటునందించాలన్నారు. జంతు బలి నిషేధాన్ని ప్రచారం చేసిన గొప్ప అహింసావాది అని కొనియాడాదరు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ట్రెయినీ కలెక్టర్ ఉమా హారతి, డీఎండబ్ల్యూఓ కమలాకర్ రెడ్డి, డీఆర్డీఓ శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్

సంత్ సేవాలాల్ సేవలకు సలాం
Comments
Please login to add a commentAdd a comment