
ఎమ్మెల్యే చొరవతో రోడ్లకు మహర్దశ
కుల్కచర్ల: గ్రామీణ ప్రాంత రహదారుల అభ్యున్నతికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, బ్లాక్ బీ అధ్యక్షుడు భరత్‌కుమార్ అన్నారు. మంగళవారం కుల్కచర్లలో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో బీటీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో రహదారులు బాగునప్పుడే మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆనందం, నాయకులు ఎల్లయ్య, శ్రీనివాస్, నరహరి, బాబు, బాలకృష్ణ, భీమయ్య, వెంకట్, భాను, రమేష్, మురళీ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
శివాజీ విగ్రహానికి భూమిపూజ
బంట్వారం: కోట్‌పల్లి మండలంలోని కంకణాలపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణం కోసం మంగళవారం భూమి పూజ చేశారు. త్వరలోనే విగ్రహం ఏర్పాటు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో నర్సింగ్‌నాయక్, కరుణాకర్‌రెడ్డి, మధుసుదన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, మల్లేశం, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుపై విగిరిపడిన చెట్టు
ధారూరు: వికారాబాద్–తాండూరు మార్గంలో మండల పరిధి అల్లిపూర్ బస్టాప్ సమీపంలో ప్రధాన రోడ్డుపై మంగళవారం ఓ చెట్టు విరిగిపడింది. దీంతో వికారాబాద్ వైపు నుంచి తాండూరు వెళ్లే వాహనదారులకు అంతరాయం కలిగింది. డబుల్ రోడ్డు కావడంతో వాహనదారులు కంగారుపడ్డారు. కొన్ని వాహనాలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. ఈ విషయం తెలిసిన ఆర్‌అండ్‌బీ వర్క్ ఇన్‌స్పెక్టర్ ఎల్లయ్య అక్కడికి చేరుకుని రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రాకపోకలు సాఫీగా జరిగేలా చేశారు.
శ్మశానవాటికలో మౌలిక వసతులు కల్పిస్తాం
మర్పల్లి: మండల కేంద్రంలోని శ్మశాన వాటికలో మౌలిక వసతుల కల్పన కోసం తన వంతు కృషి చేస్తానని మర్పల్లి మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గూడెం మల్లేశ్‌యాదవ్ చెప్పారు. మంగళవారం మండల కేంద్రంలోని శ్మశాన వాటికలో బోరు మోటారును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాములుయాదవ్‌తో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్మశాన వాటికల్లో పేరుకుపోయిన ముళ్ల పొదలను తొలిగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఫసియొద్ధీన్, మిషన్ భగీరథ ఏఈ ప్రమోద్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్, కాంట్రాక్టర్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్టడీ మెటీరియల్ అందజేత
మర్పల్లి: పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవాలని మండలంలోని ఘణాపూర్ జెడ్పీ పాఠశాల హెచ్‌ఎం అశోక్ సూచించారు. మంగళవారం విద్యార్థుల కోసం వేదాంత పబ్లికేషన్, సరస్వతి బుక్‌స్టాల్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ అందించారు. విద్యార్థులు ఓ ప్రణాళికబద్ధంగా చదువుకొని 100 శాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకు రావాలని హెచ్‌ఎం ఆకాక్షించారు.

ఎమ్మెల్యే చొరవతో రోడ్లకు మహర్దశ

ఎమ్మెల్యే చొరవతో రోడ్లకు మహర్దశ

ఎమ్మెల్యే చొరవతో రోడ్లకు మహర్దశ

ఎమ్మెల్యే చొరవతో రోడ్లకు మహర్దశ
Comments
Please login to add a commentAdd a comment