సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జంగయ్య
కొందుర్గు: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం సరికాదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జంగయ్య అన్నారు. మంగళవారం జిల్లేడ్ చౌదరిగూడ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావొస్తున్నా ఏ ఒక్క పథకం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఇంతవరకు దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తికాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేదంటే పేదల పక్షాన సీపీఐ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి వెంకటేశ్, నాయకులు బాలరాజ్, రత్నయ్య, బాలమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment