
నేడు ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ
తాండూరు రూరల్: మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో బుధవారం ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు శివాజీ యువజన సంఘం సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం
పరిగి: విద్యుత్ సరఫరాకు బుధవారం అంతరాయం కలుగుతుందని ఏఈ హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని మాధారం, పేటమాధారం, రంగాపూర్, బసిరెడ్డిపల్లి, నజీరాబాద్, న్యామత్‌నగర్‌లతో పాటు సన్‌సిటీ, జయంతినగర్, కెఆర్‌ఆర్ కాలనీ, ఎన్‌ఆర్‌ఐ కాలనీ, మధురనగర్ కాలనీ, లక్ష్మీనగర్, ఆర్టీసీ కాలనీ, వెంకటేశ్వరకాలనీలలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు మేలు
మర్పల్లి: పేదల ఆరోగ్యానికి సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురేశ్ సూచన మేరకు కొత్లాపూర్ గ్రామానికి శ్రీకాంత్‌కు రూ.80 వేల ఎల్‌ఓసీ అందజేశారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా స్పీకర్ ఆదుకుంటారని తెలిపారు. శ్రీకాంత్ కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లగా సీఎంఆర్‌ఎఫ్ కింద ఆదుకున్నారన్నారు.
ఇద్దరికి డీఎస్సీ పోస్టింగ్‌లు
మర్పల్లి: ఇటీవల డీఎస్సీ 2008 పోస్టింగ్‌లలో మండలానికి చెందిన ఇద్దరికి పోస్టింగ్ ఇచ్చారు. మండల పరిధిలోని గుండ్లమర్పల్లి పీఎస్ పాఠశాలలో మహబూబ్‌అలీ, కొంషేట్‌పల్లి ఉర్దూ మీడియం పాఠశాలలో నూరోద్దీన్ మంగళవారం విధుల్లో చేరినట్లు వారు తెలిపారు. ఆయా పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులకు స్వాగతం తెలిపారు.
కేటీఆర్‌కు ఘన స్వాగతం
కందుకూరు: ఆమనగల్లులో నిర్వహిస్తున్న రైతు దీక్ష కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డికి మంగళవారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ శ్రేణులు భారీఎత్తున స్వాగతం పలికారు. భారీ గజమాలతో సత్కరించి జేసీబీ యంత్రాలతో గులాబీ పూలను చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కందుకూరు చౌరస్తాతో పాటు దెబ్బడగూడ గేట్ వద్ద పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కంచారు. అనంతరం ఆయన వెంట రైతుదీక్షకు తరలివెళ్లారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్‌ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాథ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్.సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు జి.లక్ష్మినర్సింహారెడ్డి, గణేశ్‌రెడ్డి, కార్యదర్శి మహేందర్‌రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment