
నిరుపేదల సంక్షేమమే ధ్యేయం
మొయినాబాద్ రూరల్: నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ గౌతమ్‌కుమార్ అధ్యక్షతన షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దశల వారీగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నిరుపేదల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సంధ్య, డిప్యూటీ తహసీల్దార్ వినయ్‌సాగర్, ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు షాబాద్ దర్శన్, చేవెళ్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎలిగేపల్లి శ్రీనివాస్‌యాదవ్, మాజీ సర్పంచ్‌లు పట్లోళ్ల జనార్ధన్‌రెడ్డి, మంజులరవియాదవ్, నాయకులు గడ్డం వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని అమ్డాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రక్తమైసమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ పూజలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హోమం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా గణపతి ప్రార్థనశాల, ధ్యానాధివాసం, అభిషేకాలు, విగ్రహ పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి పాల్గొని పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు షాబాద్ దర్శన్, ఎలిగెపల్లి శ్రీనివాస్‌యాదవ్, మోత్కుపల్లి రాములు, అమ్డాపూర్ గ్రామ నాయకులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
● చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
Comments
Please login to add a commentAdd a comment