
విద్యార్థుల చదువులో నిర్లక్ష్యం తగదు
దోమ: విద్యార్థులకు అందిస్తున్న చదువులో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించరాదని ఎంఈఓ వెంకట్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో తరగతుల వారీగా ఎఫ్‌ఏ1, ఎఫ్‌ఏ2, ఎస్‌ఏ1, ఎస్‌ఏ3 కంప్యూటరీకరించాలని చెప్పారు. పాఠశాలలో టాయిలెట్స్, కంపౌండ్ వాల్, కిచెన్‌షెడ్ లేని వాటిని గుర్తించి వాటి నివేదికలు ఇవ్వాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తూ వాటి బిల్లులను ఎప్పటికప్పుడు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పదిలో మంచి ఫలితాలు రాబట్టేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. కార్యక్రమంలో కిష్టాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లాల్యనాయక్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ సీఆర్‌పీలు రెడ్యా, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఎంఈఓ వెంకట్
Comments
Please login to add a commentAdd a comment