శ్రీశైలానికి పాదయాత్రగా శివస్వాములు
దోమ: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి శివస్వాములు మంగళవారం పాదయాత్రగా బయల్దేరారు. మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామానికి చెందిన పలువురు శివస్వాములు స్థానిక శివాలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో గురుస్వాముల ఆధ్వర్యంలో ఇరుముడులు కట్టుకొని శ్రీశైల క్షేత్రానికి పాదయాత్రగా పయనమయ్యారు. శివస్వాములను సాగనంపేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఇప్పాయిపల్లిలో..
కుల్కచర్ల: మండలంలోని ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన శివస్వాములు శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. మంగళవారం స్థానిక శివాలయంలో శివస్వాములు ఇరుముడులు కట్టుకొని పాదయాత్రగా బయలుదేరారు. స్థానికులు పెద్దఎత్తునకార్యక్రమానికి తరలివచ్చారు.
శ్రీశైలానికి పాదయాత్రగా శివస్వాములు
Comments
Please login to add a commentAdd a comment