ఉన్నత భవిష్యత్‌కు మార్గాలు చూపించాలి
చేవెళ్ల: విద్యార్థుల భవిష్యత్‌కు ఉన్నతమైన మార్గాలను వేసే బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులదేనని పెద్దపల్లి మాజీ ఎంపీ బి.వెంకటేశ్ నేత అన్నారు. మండలంలోని వివేకానంద ఇంటర్నేషనల్ పాఠశాల రెండో వార్షికోత్సవాన్ని పాఠశాల చైర్మన్ కె.నరేశ్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి మాజీ ఎంపీ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పాఠశాలలో వివిధ విభాగాల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ కె. లావణ్య, డైరెక్టర్ హనుమంత్‌రావు, డీన్ మౌనిక, ప్రిన్సిపాల్ డాక్టర్ అర్చన, వైస్ ప్రిన్సిపాల్ బి.వేణుకుమార్, మేనేజర్ అర్. నరేశ్, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, మండల విద్యాధికారి పురన్‌దాస్, సీఐ భూపాల్ శ్రీధర్ పాల్గొన్నారు.
● పెద్దపల్లి మాజీ ఎంపీ బి.వెంకటేశ్ నేత
Comments
Please login to add a commentAdd a comment