కేశంపేట: మతిస్థిమితం లేని వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంజాయి జంగమ్మ(65) గ్రామంలో పాచి పనులు చేసుకుంటూ జీవించేది. గ్రామంలో జరుగుతున్న జాతరకు వెళ్లింది. ఈ క్రమంలో గ్రామ శివారులోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ఉన్న చెరువులో పడి మృతి చెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. చెరువులో నుంచి మృతదేహాన్ని బయటికు తీశారు. మృతురాలి కుమారుడు కృష్ణయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరహరి
తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment