కేంద్ర బడ్జెట్‌ను సవరించాలి
పరిగి: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా ఉందని, దీన్ని సవరించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య పేర్కొన్నారు. బుధవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సవరించాలని అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరించి బడ్జెట్‌ను రూపొందించిందన్నారు. పేద ప్రజలకు ఉపయోగం లేకుండా బడ్జెట్‌ను రూపొందించారని ఆయన విమర్శించారు. పెట్టుబడిదారులపై విధించే పన్నును 22శాతం నుంచి 15శాతానికి తగ్గించారన్నారు. పేద మధ్యతరగతుల ప్రజలు ఉపయోగించే వస్తువులపై 200శాతం పన్నులు పెంచుతూ దేశ ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ధనికులపై వారసత్వ పన్ను విధిస్తున్నారన్నారు. కానీ మనదేశంలో ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సవరించేంత వరకు పోరాటం చేస్తునే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు హబీబ్, సత్తయ్య, మహిపాల్‌రెడ్డి, రఘురాం తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య
Comments
Please login to add a commentAdd a comment