పసిడి పతకాల ప్రణవి
తలారి ప్రణవి చిరుతలా పరుగెడుతోంది. బరిలో దిగితే చాలు ఎంతమంది ప్రత్యర్థులున్నా పసిడి పతకాన్ని ఒడిసి పడుతోంది. ఇటీవల కేవలం 12 సెకన్లలోనే 100 మీటర్ల లక్ష్యాన్ని చేరుకుని రాష్ట్రస్థాయి రికార్డు నెలకొల్పింది. మూడేళ్ల కాలంలో జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని సుమారు యాభైకి పైగా స్వర్ణ, కాంస్య పతకాలు సాధించింది. తాజాగా హైదారాబాద్‌లో 11వ రాష్ట్ర యూత్ అథ్లెట్ చాంపియన్‌షిప్ పోటీల్లో ట్రై అథ్లీన్ విభాగంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
బషీరాబాద్: మండల పరిధిలోని మంతట్టి గ్రామానికి చెందిన తలారి సురేష్, శ్రీదేవి దంపతుల రెండో కూతురు ప్రణవి హైదరాబాద్ గచ్చిబౌలి ఎస్సీ గురుకులంలో పదో తరగతి చదువుతోంది. అథ్లెట్ విభాగంలో ఈబాలిక ప్రతిభను గుర్తించిన ప్రిన్సిపాల్ ఆమెను గచ్చిబౌలి స్పోర్ట్స్ అకాడమీలో చేర్పించించారు. ఇండియా అథ్లెటిక్ చీఫ్ హెడ్ కోచ్ నాగ్‌పూరి రమేశ్ వద్ద నాలుగేళ్లుగా శిక్షణ ఇప్పిస్తున్నారు. చదువుతో పాటు రోజు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మరో ఇద్దరు సహాయక కోచ్‌లు నాగరాజ్, షాజి అథ్లెటిక్స్‌లో ఆమెకు మెలకువలు నేర్పిస్తూ రాటుతేల్చారు.
రన్నింగ్, జంపింగ్ విభాగాల్లో..
వివిధ జిల్లాల్లో జరిగిన అనేక అండర్– 14 జోనల్ పోటీల్లో పాల్గొన్న ప్రణవి చిరుతలా పరుగెడుతూ కేవలం 12 సెకండ్లలో 100 మీటర్ల లక్ష్యాన్ని చేరుకుంంది. ఈ క్రమంలో సీఎం కప్, స్వేరో ఒలింపిక్స్, గురుకులాల అథ్లెటిక్, రాష్ట్ర స్థాయి అథ్లెట్ పోటీల్లో రన్నింగ్, జంపింగ్ విభాగాల్లో బోలెడు బంగారు పతకాలు సాధించింది. రన్నింగ్, జంపింగ్‌లో బోలెడు పసిడి పతకాలు సాధించింది. పాఠశాలలో ఉపాధ్యాయులు, కోచ్‌లు అందరూ ప్రేమగా ప్రణవిని పరుగుల రాణిగా సంబోధిస్తూ జాతీయ అథ్లెటిక్ పోటీలకు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 17 నుంచి ఉస్మానియా యునివర్సిటీలో జరుగుతున్న 11వ రాష్ట్ర యూత్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ అండర్– 14లో ట్రై అథ్లీన్ విభాగంలో మరో గోల్డ్ మెడల్ సాధించి సత్తాచాటింది.
ఇంటి నిండా పతకాలే..
ప్రణవికి చిన్ననాటి నుంచి ఆటలు ఎంతో మక్కువ. 5వ తరగతి నుంచే అథ్లెట్ గేమ్స్‌లో పతకాల వేట ప్రారంభించింది. ముఖ్యంగా రన్నింగ్, జంపింగ్‌లో తనకుతానే సాటి అన్నట్లు ప్రతిభ కనబరుస్తోంది. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో నిర్వహించిన అథ్లెట్ గేమ్స్‌లో 50కి పైగా బంగారు , కాంస్య పతకాలు, చాంపియన్ ట్రోఫీలు సొంతం చేసుకుంది. ఆమెకు వచ్చిన పతకాలు, ప్రశంస పత్రాలతో ఓ గది నిండిపోయిందంటే అతిశయోక్తి కాదు.
చిరుతలా పరుగెడుతున్న గురుకుల విద్యార్థిని
12సెకన్లలో 100 మీటర్ల లక్ష్యం
చేరుకుని రికార్డ్
నాలుగేళ్లలో 50కి పైగా బంగారు, కాంస్య పకతాలు
రాష్ట్ర స్థాయి అండర్– 14
ట్రై అథ్లీన్ విభాగంలో మరో గోల్డ్
అంతర్జాతీయ అథ్లెట్ కావడమే
లక్ష్యమంటున్న మంతట్టి బాలిక
అంతర్జాతీయ అథ్లెట్ కావడమే లక్ష్యం
తల్లిదండ్రుల ప్రోత్సాహం.. కోచ్‌ల మార్గదర్శంలో రాష్ట్ర స్థాయిలో ఆడుతున్నా. నా ప్రతిభను చూసి గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి నాపై ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. కోచ్‌లు నాగ్‌పూరి రమేష్, నాగరాజు, షాజి, ప్రిన్సిపాల్ సుజాత ప్రతీరోజు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్‌లో చాపియన్‌గా నిలువాలన్నదే నా లక్ష్యం. ఆ దిశగా సాధన చేస్తున్నా. పదో పరీక్షలకు సిద్ధమవుతున్నా. మా నాన్నే నాకు ఆదర్శం.
– ప్రణవి, క్రీడాకారిణి
పసిడి పతకాల ప్రణవి
పసిడి పతకాల ప్రణవి
Comments
Please login to add a commentAdd a comment