క్రీడల్లో గెలుపోటమలు సహజం
అనంతగిరి: క్రీడల్లో గెలుపోటములు సహజమని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ధన్నారంలోని డీఏఆర్ గ్రౌండ్‌లో స్వర్గీయ గడ్డం శైలజ స్మారక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ తన సతీమణి శైలజపై అభిమానంతో క్రికెట్ పోటీలను ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, డీసీసీబీ డైరక్టర్ కిషన్‌నాయక్, రాంచంద్రారెడ్డి, సతీష్‌రెడ్డి, మల్లేశం, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
కారు ఢీ.. ఒకరి మృతి
మొయినాబాద్: కారు ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మలక్‌పేట్‌కు చెందిన ఇమ్రాన్(40) బండ్లగూడలో టెంట్‌హౌస్ నిర్వహిస్తున్నాడు. బుధవారం మొయినాబాద్‌కు వెళ్లిన ఇమ్రాన్.. తిరిగి వెళ్తూ భోజనం చేయడం కోసం జేబీఐటీ కళాశాల ఎదుట రోడ్డు పక్కన చిన్న హోటల్ సమీపంలో తన కారును ఆపి, నడుచుకుంటూ హోటల్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అదే సమయంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అతివేగంతో వచ్చి ఇమ్రాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ.. ఢీకొట్టిన కారు అలాగే ముందుకు దూసుకుపోయి మరో బులెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇమ్రాన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియాకు, స్వల్పగాయాలైనవారిని స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇమ్రాన్ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీ
రైతు మృతి
చేవెళ్ల: పొలం పనులు ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న రైతును గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో అతను మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన ప్రకారం.. చేవెళ్ల మండల పరిధి అల్లవాడ గ్రామానికి చెందిన యాలాల పెద్ద వెంకట్‌రెడ్డి(65) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే పొలానికి వెళ్లిన అతను.. రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా గ్రామ బస్‌స్టేజికీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రైతును గుర్తించిన స్థానికులు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం పట్నం మహేందర్‌రెడ్డి హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం బుధవారం కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్రీడల్లో గెలుపోటమలు సహజం
క్రీడల్లో గెలుపోటమలు సహజం
Comments
Please login to add a commentAdd a comment