పూడూరు: అనుమానాస్పదంగా ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని మృతి చెందిన సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పెద్ద ఉమ్మెంతాల్ నుంచి కంకల్ వెళ్లే దారిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా బిహార్ రాష్ట్రానికి చెందిన చోటు మంజు అని గుర్తించారు. వివరాలు తెలిస్తే చన్గోముల్ పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
లేబర్ కమిషనర్ వద్దకు ‘సీసీఐ’ పంచాయితీ
కార్మికులకు చెల్లించాల్సిన
గ్రాడ్యూవిటిపై చర్చ
తాండూరు రూరల్: కరన్‌కోట్ గ్రామ శివారులోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీ వ్యవహారం డిప్యూటీ లేబర్ కమిషనర్ వద్దకు చేరింది. కంపెనీలో రైల్వే కాంట్రాక్టు కార్మికులుగా పని చేసి కొంత మంది కార్మికులు ఉద్యోగ విరమణ చేశారు. సీసీఐ యాజమాన్యం నుంచి రావా ల్సిన గ్రాడ్యూవిటి చెల్లించాలని కార్మిక సంఘం నేత శరణప్పతో పాటు పలువురు హైదరాబాద్‌లో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ రాఘవేంద్రనాయక్‌ను వేడుకున్నారు. ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు గ్రాడ్యూవిటి చెల్లించే విధంగా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ విషయమై మార్చి 26వ తేదీన మరోసారి యాజమాన్యం, కార్మికులతో చర్చలు నిర్వహిస్తానని లేబర్ కమిషనర్ తెలిపారన్నారు. కరన్‌కోట్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ శరణు బసప్ప తన బృందంతో డిప్యూటీ లేబర్ కమిషనర్ వద్దకు వెళ్లి సీసీఐ యాజమాన్యం గ్రాడ్యూవిటి చెల్లించే క్రమంలో కార్మిక సంఘం నేత శరణప్ప కార్మికులను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ కార్మికులకు మాత్రం న్యాయం జరగాలని వారు కోరుతున్నారు.
కుక్కల దాడిలో
నెమలికి గాయాలు
ఇబ్రహీంపట్నం: వీధికుక్కల దాడిలో నెమిలి గాయపడింది. ఈ సంఘటన బుధవారం ఉదయం ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక చెరువు కట్టపై నాలుగైదు కుక్కలు జాతియ పక్షి నెమలిని వెంటాడుతున్నాయి. వాకింగ్‌కు వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌గౌడ్, మరో ఇద్దరు యువకులు కుక్కల బారి నుంచి నెమలిని కాపాడారు. గాయపడిన నెమలిని చెరదీసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వచ్చిన ఆ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డికి నెమలిని అప్పగించారు. అనంతరం స్థానిక పశువైద్యశాలలో మయూరానికి చికిత్స చేయించారు. ప్రాణాపాయస్థితి నుంచి కొలుకున్న పక్షిని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు, యువకులను అటవీశాఖ అధికారులు
అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment