చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
అనంతగిరి: చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో జిల్లా మహిళ సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో పది సంవత్సరాల వేడుకల్లో భాగంగా వికారాబాద్ నియోజకర్గంలోని కేజీబీవీ పాఠశాలల విద్యార్థినులకు కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఆడ, మగ తారతమ్యం లేకుండా అన్ని అవకాశాలు కల్పించాలన్నారు. అమ్మాయిలు సాధించలేనిది ఏది లేదన్నారు. విద్యతోనే అన్ని సాధ్యమన్నారు. ఈ పోటీల్లో ధారూర్ కేజీబీవీ విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment