భారతి సిమెంట్‌కు తిరుగులేదు
పరిగి: నాణ్యతకు మారో రూపమే భారతి సిమెంట్ అని సంస్థ టెక్నికల్ మేనేజర్ సునీల్ అన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలోని శ్రీ రాజేశ్వరి ట్రేడర్స్ డీలర్ షాప్‌లో తాపీమేసీ్త్రల సమావేశం నిర్వహించి 25 మందికి రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మార్కెట్‌లో లభించే ఇతర సిమెంట్‌లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ చాలా నాణ్యమైందన్నారు. దీంతో నిర్మించిన నిర్మాణాల నాణ్యత ప్రామాణాలు ఉన్నతమైనవన్నారు. ఈ సిమెంట్‌ను ఎక్కువ శాతం నిర్మాణ రంగాల్లో స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారులకు సరైన ఎంపిక అన్నారు. భారతి అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు సంస్థ నుంచి ఉచిత సాంకేతికసాయం అందిస్తామన్నారు. స్లాబ్ కాంక్రీట్ సమయంలో ఇంజనీర్లను సైట్ వద్దకు వచ్చి నిర్మాణంలో సహాయపడుతారన్నారు. కార్యక్రమంలో భారతి సిమెంట్ బృందం మార్కెటింగ్ మేనేజర్ సతీష్‌రాజు, అసిస్టెంట్ మేనేజర్ వీరాంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంస్థ టెక్నికల్ మేనేజర్ సునీల్
Comments
Please login to add a commentAdd a comment