కొందుర్గు: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడుచుకోవాలని సూచించారు. యువత దురలవాట్లకు చేరువ కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబయ్య, మండల అధ్యక్షుడు లక్ష్మీకాంత్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివారెడ్డి, మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment