మధ్యాహ్న భోజనంలో నిర్లక్ష్యం వహించొద్దు
వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర
కుల్కచర్ల: విద్యార్థులకు అందించే భోజనంలో నిర్లక్ష్యం వహించరాదని వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర సూచించారు. బుధవారం మండలంలోని బండవెల్కిచర్ల గ్రామ పరిధిలోని గిరిజన గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొన్నిరోజుల వరకు చికెన్‌ను పెట్టవద్దని సూచించారు. ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సమయానుకూలంగా భోజనాన్ని అందించాలని పేర్కొన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో కుల్కచర్ల డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
ఎస్పీ నారాయణరెడ్డి
యాలాల: కాగ్నానది నుంచి ఎవరైనా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కె.నారాయణరెడ్డి హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని కోకట్ గ్రామ శివారులోని కాగ్నానది పరివాహక ప్రాంతాన్ని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా కాగ్నా నదిలో అధికారులు గుర్తించిన ఇసుక రీచ్‌లను పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఇసుక రవాణాకు ఆటంకం లేకుండా చూడాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు. ప్రభుత్వ అనుమతులు పొంది ఇతర ప్రాంతాలకు తరలిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి కబడ్డీ పోటీలు
వికారాబాద్‌లో రాష్ట్రస్థాయి క్రీడలు
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని గౌలికార్ ఫంక్షన్ హాల్‌లో గురువారం నుంచి ఈ నెల 23 వరకు రాష్ట్రస్థాయి కబడ్డీ సబ్ జూనియర్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పరుశురాంనాయక్, ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఆనంద్ తెలిపారు. బుధవారం క్రీడా పోటీల నిర్వహణ ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ పోటీల్లో 33 జిల్లాల నుంచి బాలురు, బాలికలు పాల్గొంటారన్నారు. పోటీలను అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రారంభిస్తారని చెప్పారు. పోటీలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వికారాబాద్‌లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. వీటిని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి, సద్దాం, నరేందర్ నాయక్, నరసింహనాయక్, రఘు, కలిమొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
‘ఫ్యూచర్’ భద్రతకు
ఠాణా ఏర్పాటు
యాచారం: ప్యూచర్ సిటీ భద్రతను దృష్టిలో పెట్టుకుని కొత్తగా పోలీస్‌స్టేషన్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించందని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. ఇందుకు మర్లకుంటతండా సమీపంలోని 330 అడుగుల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పక్కనే టీజీఐఐసీకి చెందిన మూడు ఎకరాల స్థలంలో ‘హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ’ పేరుతో ఠాణా ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. బుధవారం ఆమె.. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజుతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏ మార్గం గుండా వెళ్తోందనే విషయాలను తెలుసుకున్నారు.
మధ్యాహ్న భోజనంలో నిర్లక్ష్యం వహించొద్దు
మధ్యాహ్న భోజనంలో నిర్లక్ష్యం వహించొద్దు
Comments
Please login to add a commentAdd a comment