మహిళల అభ్యున్నతికి పెద్దపీట
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం వికారాబాద్‌లోని ధర్మ విద్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో ఉచితంగా కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న నియోజకవర్గానికి చెందిన 105 మంది మహిళలను ఆయన అభినందించారు. వారికి కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. అందుకు జీవనోపాధి అవకాశాలు పెంపొందించుకోవాలన్నారు. ప్రస్తుతం టైలరింగ్‌కు మంచి డిమాండ్ ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తుందన్నారు. మహిళ సంఘాల బలోపేతానికి ప్రభుత్వం తగిన చొరవ తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎస్సీల అభివృద్ధి కోసం రూ.21,874 కోట్లు కేటాయించిందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు నిధులు తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, డీసీసీబీ డైరెక్టర్ కిషన్‌నాయక్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, నాయకులు రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్, మురళీ, రాజ్‌కుమార్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment