హెలిపాడ్ పరిశీలించిన ఎస్పీ
పోలేపల్లి ఎల్లమ్మ జాతరలో పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. బుధవారం ఆయన జాతర ప్రాంగణం, ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తజనానికి సహకరించాలన్నారు. జాతరలో దొంగతనాలు, గొడవలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అప్రమత్తతతో మెలగాలని పోలీసు సిబ్బందికి సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి రాక నైపథ్యంలో హెలిపాడ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ జయరాములు, కమిటీ సభ్యులు, మేనేజర్ రాజేందర్‌రెడ్డి, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment