కడ్తాల్: కృత్రిమంగా ఇసుక తయారు చేస్తున్న నలుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని సీఐ శివప్రసాద్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి ముద్వీన్ గ్రామ సమీపంలో గల వాగు నుంచి మట్టిని తీసి, కృత్రిమ ఇసుకను తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఈ నెల 14న ఇసుక ఫిల్టర్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకులు మహేశ్, శ్రీశైలం, శేఖర్, జంగయ్య పరారు కాగా.. జేసీబీతో పాటు, ఐదు మోటార్లు, ఐదు స్టార్టర్ బాక్స్‌లు, పదిబోరు పైపులు, నాలుగు చొప్పున ఇసుక, మట్టి దిబ్బలను సీజ్ చేశారు. గురువారం విశ్వసనీయ సమాచారం మేరకు ముద్వీన్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. పరారీలో ఉన్న నిందితులు పట్టుబడ్డారు. ఈ మేరకు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. అనుమతులు లేకుండా ఇసుక తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment