దైవచింతనతో మానసిన ప్రశాంతత
కేశంపేట: దైవ చింతన కలిగి ఉంటేనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని అలివేలుమంగ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అంతర్రాష్ట్ర రెండెద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేర్వేరుగా పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పోటీలను తిలకించారు. అనంతరం గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... గ్రామస్తులు ఐకమత్యంగా వేడుకలు జరపడం ఆనందంగా ఉందన్నారు. పోటీల్లో మొదటి బహుమతి వైపీఆర్ బుల్స్, ఎల్చల ప్రసన్నరెడ్డి, నాదర్‌గుల్(హైదరాబాద్), రెండో బహుమతి కుందురు రాంభూపాల్‌రెడ్డి, గంపరమన్నుదిన్నే(నంద్యాల), మూడో బహుమతి కేవీఆర్ బుల్స్, కటకం వెంకటేశ్వర్లు, ఇనిమెట్ల(పల్నాడు జిల్లా), నాలుగో బహుమతి షేక్ మహ్మద్, షేక్ ఫరీద్, బలికురవ(బాపట్ల జిల్లా), ఐదో బహుమతి పావులూరి వీరస్వామి చౌదరి, బలికురవ(బాపట్ల జిల్లా) ఎద్దులు పోటీల్లో ప్రతిభ చూపాయి. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్‌గౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు తాండ్ర విశాల శ్రావణ్‌రెడ్డి, నాయకులు వీరేష్, వెంకట్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, జగదీశ్వర్, శ్రీధర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, అంజిరెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి
కేశంపేటలో అంతర్రాష్ట్ర రెండెద్దుల బండలాగుడు పోటీలు
Comments
Please login to add a commentAdd a comment