ప్రణాళికాబద్ధ్దంగా చదవాలి
జిల్లా విద్యాధికారి రేణుకాదేవి
పరిగి: ప్రతీ విద్యార్థి ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి ఉత్తీర్ణత సాధించొచ్చని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పేర్కొన్నారు. పట్టణ కేంద్రంలోని నంబర్ 1 ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. పదోతరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ఫ్రీఫైనల్ పరీక్షల విధానాలను పరిశీలించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదోతరగతి విద్యార్థులు కష్టపడి చదివి, మంచి ఫలితాలు తీసుకురావాలన్నారు. ఉన్నత చదువులకు పదోతరగతి పునాది లాంటిదన్నారు. కావున చదవుపై ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు కనీసం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు సూచనలు, సలహాలు అందించాలన్నారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేషించుకుని వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలని అన్నారు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉన్నత విద్యలో మంచి అవకాశాలు అందుతాయన్నారు. ప్రతీ విద్యార్థికి పదో తరగతి ఎంతో ముఖ్యమన్నారు. చదువులో ఎలాంటి సందేహాలు ఉన్న వెంటనే ఉపాధ్యాయుని సలహాలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను గ్రూపులుగా చేసి చదివిస్తే మంచి ఉత్తీర్ణత సాధించొచ్చన్నారు. ఉపాధ్యాయులు పదోతరగతి విద్యార్థుల పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
బంట్వారంలో..
బంట్వారం: విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలంటూ ఎంఈఓ చంద్రప్ప ఆకాంక్షించారు. గురువారం ఆయన కోట్‌పల్లి మండలంలోని రాంపూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో పాఠాలు చదివించారు. ప్రాథమిక స్థాయినుంచే బాగా చదువుకోవాలన్నారు. ప్రశ్నించే తత్వం ఇప్పటి నుంచే అలవర్చుకోవాలన్నారు. పాఠ్యాంశాల్లో ఏమైనా అర్థం కాకుంటే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. చదువుతోపాటు ఆటలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. ప్రతిరోజు దినపత్రికలు, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. ఉపాధ్యాయురాలు మానసకు పలు సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment