గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్
తాండూరు రూరల్: గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్ అని తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్‌నాయక్ అన్నారు. గురువారం పెద్దేముల్ మండలం కందనెల్లి తండా సమీపంలోని యాడి బాపుగుట్టపై జాగో బంజార సమాజ్ వ్యవస్థాపకుడు సురేందర్‌నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఠల్‌నాయక్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలన్నారు. సొంత ఖర్చుతో సురేందర్ నాయక్ ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. గుట్టపై బోరు వేయించి తనవంతు సహకారం అందిస్తానన్నారు. అనంతరం సురేందర్‌నాయక్ మాట్లాడుతూ.. రూ.2 కోట్లతో గుట్టపై శివాలయం, జగదాంబ మాత, ఎల్లమ్మ తల్లి ఆలయంను నిర్మిస్తున్నామన్నారు. తన వంతుగా రూ.40లక్షల విరాళం అందజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జాగో బంజార వ్యవస్థాపకులు రమావత్ శాంతిదేవి, గిరిజన బంజార కన్వీనర్ పాండు నాయక్, విద్యుత్ ఏడీ శంకర్‌నాయక్, మాజీ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్‌చారి, మదనంతాపూర్ మాజీ సర్పంచ్ లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్‌నాయక్
Comments
Please login to add a commentAdd a comment