రైతు సేవకు మరో అవకాశం
ధారూరు: మరో ఆరు నెలల పాటు మండల రైతులకు సేవ చేసే అవకాశం లభించిందని ధారూరు పీఏసీఎస్ చైర్మన్ వై.సత్యనారాయణరెడ్డి అన్నారు. గురువారం ధారూరు పీఏసీఎస్ కార్యాలయంలో పాలకవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పాలకవర్గ పదవీకాలన్నా మరో ఆరు నెలలు పొడిగించిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మాణం చేసిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మరో అవకాశంతో పీఏసీఎస్ అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. సంఘం ఆధ్వర్యంలో కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయాలని పాలకవర్గం తీర్మాణించిందని చెప్పారు. అనంతరం పాలకవర్గ సభ్యులను సీఈఓ నర్సింలు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు ఎం.శివకుమార్, కె.గోపాల్‌రెడ్డి, జరీనాబేగం, మల్లమ్మ, రవీందర్, అబ్దుల్‌కరీం పాల్గొన్నారు.
ధారూరు పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment