ఘనంగా గడ్డ మైసమ్మ జాతర
అనంతగిరి: మున్సిపల్ పరిధిలోని దన్నారం గ్రామంలో గడ్డ మైసమ్మ జాతర గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు శాసన సభ స్పీకర్ ప్రసాద్‌కుమార్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతరకు వచ్చిన భక్తులు, బంధుమిత్రులతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఉత్సవాలకు హారైన స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఆలయం వరకు రూ.30లక్షల నిధులు నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. పూజల అనంతరం ఆలయ కమిటీ స్పీకర్‌ను ఘనంగా సన్మానించంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సుధాకర్‌రెడ్డి, కిషన్‌నాయక్, రాంచంద్రారెడ్డి, రత్నారెడ్డి, సత్యనారాయణ, మైపాల్‌రెడ్డి, చిగుళ్లపల్లి రమేష్‌కుమార్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ధన్నారంలో భక్తుల కిటకిట
ఉత్సవాలకు హాజరైన స్పీకర్ ప్రసాద్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment