కేశంపేట: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ శ్రీలత సూచించారు. గురువారం మండల పరిధిలోని సంతాపూర్, బోధునంపల్లి, చౌలపల్లి, నిర్ధవెళ్లి గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన నర్సరీలు, ఫార్మేషన్ రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ఉపాధి పనుల్లో కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూ చించారు. నిబంధనల ప్రకారం పనిచేస్తే రోజు కూలీ రూ.300 పొందే అవకాశం ఉందని తెలిపారు. ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వన మహో త్సవాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన మొక్కలను అందుబాటులో ఉంచాలని ఆదేశించా రు. ఆమె వెంట ఏపీడీ శ్రీచరణ్, జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ సంధ్య, ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డి, ఎంపీఓ కిష్టయ్య, ఏపీఓ అజీజ్, టీఏ నీలకంఠబాబు తదితరులు ఉన్నారు. అంతకుముందు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన ‘ఆరోగ్యం– పోషకాహారం’ శిక్షణ సదస్సులో పీడీ ప్ర సంగించారు.
డీఆర్డీఏ పీడీ శ్రీలత
Comments
Please login to add a commentAdd a comment