
విద్యార్థులకు అల్పాహారం అందజేత
కుల్కచర్ల: రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నర్సింలు యాదవ్ విద్యార్థులకు వారానికి ఒకసారి అల్పాహారం అందజేస్తున్నారు. శుక్రవారం ఉదయం పాఠశాల విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాఠశాల ప్రారంభ సమయంలో విద్యార్థులకు అల్పాహారం అందజేయడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు. విద్యార్థుల ఉన్నతికి ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
కొనసాగుతున్న కబడ్డీ పోటీలు
అనంతగిరి: వికారాబాద్ పట్టణం గౌలికార్ ఫంక్షన్ హాల్‌లో ప్రారంభమైన సబ్‌జూనియర్ అంతర్‌జిల్లాల కబడ్డీ బాలబాలికల చాంపియన్ షిప్ పోటీలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని ఆయా జిల్లాల నుంచి వచ్చిన కబడ్డీ క్రీడాకారులు శుక్రవారం లీగ్ మ్యాచ్‌లు ఆడారు. క్రీడాకారులు తమ ఆటలో నైపుణ్యాన్ని ప్రదర్శించి తమ సత్తాను చాటుతున్నారు. శనివారం నాకౌట్ దశకు చేరుకుంటాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పరుశరాం, వినోద్‌లు తెలిపారు.
మాతృభాష తల్లివంటిది
కుల్కచర్ల: మాతృభాష తల్లివంటిదని కస్తూర్బాగాంధి బాలికల ఆశ్రమ పాఠశాల ప్రత్యేకాధికారి దేవి అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని కేజీబీవీలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతీ ఒక్కరికి సొంత భాషపై అభిమానం ఉంటుందని, సొంత భాషను తమ ఇంటిలా భావిస్తారని పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా, ఇతర ప్రాంతాలకు వెళ్లినా తమ భాష వచ్చిన వారు కలిస్తే తమ బంధువులు కలిసినట్లుగా అనిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
అర్హులైన వారికి
ఇందిరమ్మ ఇళ్లు
దోమ: అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం దోమ మండల పరిధిలోని శివారెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామంలోని పేద ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి మూడు వేల ఐదువందల ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ఐదేళ్ల లోపు 20 వేల ఇళ్లు నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం ఏ పేదవాడికి ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెందిన అభ్యర్థులను గెలిపించుకునేలా ప్రజలు సంసిద్ధం కావాలన్నారు.
రూ.25కోట్లు
కేటాయించాలి
బొంరాస్‌పేట: పోలేపల్లి ఎల్లమ్మ ఆలయాభివృద్ధికి ప్రభుత్వం రూ.25కోట్లు కేటాయించాలని శుక్రవారం విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం హకీంపేటలో విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలయ అభివృద్ధికి, డబుల్‌రోడ్డు, తదితర సౌకర్యాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అతిపెద్ద జాతరగా గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, చాంద్‌పాషా, శేరినారాయణరెడ్డి, యాదగిరి, నెహ్రూనాయక్,వెంకట నరేందర్ పాల్గొన్నారు.

విద్యార్థులకు అల్పాహారం అందజేత

విద్యార్థులకు అల్పాహారం అందజేత

విద్యార్థులకు అల్పాహారం అందజేత
Comments
Please login to add a commentAdd a comment