
ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు
తాండూరు టౌన్: ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగని వాసవి మహిళా సంఘం తాండూరు అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం పాత తాండూరులోని ప్రభుత్వ నంబర్ 2 పాఠశాలలోని పదోతరగతి విద్యార్థులకు సంఘం తరుఫున పరీక్ష ప్యాడ్లు, జామెట్రీ బాక్సు తదితర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, సంఘం సభ్యులతో కలిసి పాఠఽశాల ఆవరణలో మొక్క నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆడపిల్లలు చదువుకుంటే కుటుంబంలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తారన్నారు. చిన్ననాటి నుంచే అత్యున్నత లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్య సాధనకోసం కృషి చేయాలన్నారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున ఏకాగ్రత, పట్టుదలతో చదివి ఉత్తమ మార్కులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి మంకాల్ స్వప్న, కోశాధికారి సింగంశెట్టి శోభ, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వాసవి మహిళా సంఘం
అధ్యక్షురాలు నాగలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment