
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
కుల్కచర్ల: నిరుపేద బడుగుబలహీనవర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన రాజుకు సీఎం సహాయ నిధి చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అనారోగ్య సమస్యలు తలెత్తిన సందర్భంలో ఆరోగ్యశ్రీ క్రింద పరిగణలోకి రాని వైద్యచికిత్సలు, ఆస్పత్రి సంబంధిత ఆర్థిక ఖర్చులను పరిగణన లోకి తీసుకుని పేద ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూతనిస్తుందన్నారు. వైద్యం కోసం ఇబ్బందులకు గురయ్యే వారికి ప్రభుత్వం తోడుగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జోగు వెంకటయ్య, ఆనందం, తమ్మలి రాంచంద్రయ్య, రాజు, ఎల్లయ్య, వెంకటేష్, నరహరి, శ్రీను, మురళీ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment