
వినియోగదారుడా..బీ అలర్ట్!
సిటీ కోర్టులు: మార్కెట్‌లో కొనుగోలు చేసిన వస్తువు నాణ్యత, సేవల పరంగా వినియోగదారుడికి ఏ విధమైన మోసం జరిగినా మేమున్నామంటూ వినియోగదారుల ఫోరం అండగా నిలుస్తోంది. కొనుగోలు చేసే వస్తువులపై గరిష్ట ధర (ఎమ్మార్పీ), ఎక్స్‌పైరీ తేదీ, కంపెనీ చిరునామా, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబరు తదితర వివరాలు ఉత్పత్తులపై ముద్రించాల్సి ఉంటుంది. పేర్కొన్న వివరాలకు, వస్తువు, సేవల్లో పొందిన వాస్తవానికి తేడాలున్నపుడు వినియోగదారుడు ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. పైసా ఖర్చు లేకుండా కమిషన్‌లో కేసు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఆర్థిక స్థోమత లేనివారు సొంతంగా తమ కేసును తామే వినిపించుకునే వెసులుబాటూ ఉంది. ఆన్‌లైన్‌లోనూ కేసు నమోదు చేసుకోవచ్చు. వర్చువల్‌గా కేసుల వాదనలు వినిపించుకోవచ్చు. రూ.50 లక్షల విలువైన వస్తువు, సేవల కోసం జిల్లా కమిషన్‌లో ఫిర్యాదు చేయాలి. రూ.2 కోట్ల వరకు రాష్ట్ర కమిషన్‌లో, అంతకుమించితే జాతీయ కమిషన్‌లో ఫిర్యాదు చేయాలి. వినియోగదారుడి హక్కులు, ప్రయోజనాల గురంచి తెలియజెప్పేందుకు మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం కూడా నిర్వహిస్తున్నారు.
వినియోగదారుల కమిషన్ల ఫోన్ నంబర్లు
● టోల్ ఫ్రీ నంబర్: 180042500333
● జాతీయ వినియోగదారుల కమిషన్, న్యూఢిల్లీ: ఫోన్ 011–24608724.
● తెలంగాణ రాష్ట్ర కమిషన్, హైదరాబాద్, ఫోన్: 040–23394399
● హైదరాబాద్ జిల్లా కమిషన్ ఎంజే రోడ్, నాంపల్లి, ఫోన్: 040–24733368, 040–24747733, 040–24746001
● రంగారెడ్డి జిల్లా కమిషన్, ఎన్‌టీఆర్ నగర్, ఎల్‌బీనగర్, ఫోన్: 040–24031275
ఆర్థిక భారం లేకుండా న్యాయం పొందే అవకాశం
ఈ చట్టం గురించి తెలుసుకుంటే ఎంతో మేలు
కేసుల పరిష్కారం ఇలా..
సంవత్సరం నమోదైనకేసులు పరిష్కారమైనవి
2023 1,076 1,274
2024 1,340 1,358
2025 113 159
సరైన రసీదు తీసుకోవాలి
వినియోగదారులు ఏదైనా వస్తువు కొన్నప్పుడు రసీదు తప్పక తీసుకోవాలి. ఆ వస్తువులో ఏదైనా లోపం ఉందని భావించినప్పుడు మీరు కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం పొందడానికి ఆ రసీదు చాలా ఉపయోగపడుతుంది.
– రాంగోపాల్‌రెడ్డి, అధ్యక్షుడు, హైదరాబాద్ వినియోగదారుల ఫోరం–3
Comments
Please login to add a commentAdd a comment