
పన్ను వసూలుపై ఆగ్రహం
తాండూరు: మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్నుల వసూలు కోసమే బిల్ కలెక్టర్లు ఉన్నారని, కానీ వారు విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడం ఏంటని మున్సిపల్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ విక్రంసింహారెడ్డితో కలిసి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏడాది కాలంగా పన్నులు వసూలు చేసే అవకాశం ఉన్నా ఎందుకు వసూలు చేయలేదని ప్రశ్నించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సీరియస్ అయ్యారు. ఈ ఏడాది మున్సిపాలిటీలో కేవలం 33 శాతమే వసూలు చేయడం దారుణమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 100 శాతం పన్ను వసూలు చేయాలని హెచ్చరించారు. అనంతరం సిబ్బందితో కలిసి పట్టణంలోని పలు దుకాణ సముదాయాలకు వెళ్లి పన్నులను వసూలు చేశారు.
బిల్ కలెక్టర్లు ఏం చేస్తున్నారు?
సమీక్ష సమావేశంలో మున్సిపల్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ మండిపాటు
Comments
Please login to add a commentAdd a comment