
హెచ్‌ఎండీఏలోకి మోమిన్‌పేట గ్రామాలు
హెచ్‌ఎండీఏ పరిధిలోకి వెళ్లనున్న చీమల్‌దరి గ్రామం
మోమిన్‌పేట: హెచ్‌ఎండీఏ పరిధిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్ వెంబడి రెండు కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న గ్రామాలను హెచ్‌ఎండీఏ ఆధీనంలోకి తేనున్నారు. ఈ క్రమంలో మోమిన్‌పేట పరిధిలోని చీమల్‌దరి, దేవరంపల్లి, చక్రంపల్లి, బాల్‌రెడ్డిగూడెం గ్రామ పంచాయతీలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తున్నాయి. దీంతో డీటీపీసీ పరిధి నుంచి లేఅవుట్లు హెచ్‌ఎండీఏ పరిధిలోని వెళ్లనున్నాయి. గ్రామాల అభివృద్ధికి మరిన్ని నిధులు అదనంగా రానున్నాయి. దీంతో రైతుల భూములు మరింత పెరగనున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
80 శాతం అమ్ముకున్న భూములు
ఈ నాలుగు గ్రామ పంచాయతీలలో రెండు సంవత్సరాల క్రితమే 80శాతం వరకు భూములను రైతులు అమ్ముకున్నారు. అప్పట్లోనే ఎకరా రూ.కోట్లల్లో పలికింది. ప్రస్తుతం రియల్ నేల చూపులు చూడటంతో ఽఅమ్మకాల, కొనుగోలులు నిలిచిపోయాయి. రైతుల వద్ద కేవలం 20శాతం భూమి మాత్రమే మిగిలి ఉంది. హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తే భూములు ధరలు పెరగనున్నాయని స్థిరాస్తి వ్యాపారులు పేర్కొంటున్నారు.
అభివృద్ధి వేగవంతం అవుతుందని స్థానికుల సంబురం
Comments
Please login to add a commentAdd a comment