హైవేపై కూలిన మర్రిచెట్లు
చేవెళ్ల: హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై రెండు చోట్ల ప్రమాదవశాత్తు రెండు మర్రిచెట్లు విరిగి పడ్డాయి. ఈ సంఘటనలు చేవెళ్ల మండలం ఖానాపూర్ బస్టేజీ సమీపంలో ఒకటి, ఆలూరు బస్టేజీ సమీపంలో మరొకటి చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం స్వల్ప వ్యవధిలో రెండు చోట్ల చెట్లు కూలిపోయాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎలాంటి వాహనాలు పరుగు తీయకపోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మరోమార్గం లేకపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్‌ఐ శంకరయ్య, ఏఎస్‌ఐ చందర్‌నాయక్‌లు సిబ్బంది, స్థానికుల సహాయంతో జేసీబీతో చెట్లను పక్కకు తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేయించారు. ఈ మర్రి చెట్లు మొదళ్లు కాలిపోయి ఉండటంతో గాలి వీచిన సమయంలో ఇలా రోడ్డుపై పడిపోతున్నాయని, వాహనదారులు చెట్ల కింద ప్రయాణం చేసే సమయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలని పోలీసులు సూచించారు.
తప్పిన ప్రమాదం, ట్రాఫిక్ అంతరాయం
Comments
Please login to add a commentAdd a comment