
లెక్కల కోసమే నాటడం
ఉపాఽధిహామీ, పంచాయతీరాజ్ అధికారులకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయడానికే మొక్కలు నాటుతున్నారు. మొక్కలు నాటిన తర్వాత వాటిని సరంక్షించే వారే కరువయ్యారు. ప్రతీ ఏడాది రోడ్ల పక్కన మొక్కలు కాలిపోతున్నాయి. ఇవి అఽధికారులకు కనిపించడం లేదా? ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
– బల్వంత్‌రెడ్డి, మాజీ సర్పంచ్, దాతాపూర్
గడ్డి పెరగకుండా చూడాలి
వనమహోత్సవంలో మొక్కలు నాటుతున్నారు. ఉపాధి హామీ సిబ్బందికి వర్షాకాలంలో పనులు ఉండవు. మొక్కలు కాపాడే బాధ్యత అప్పగించాలి. రోడ్ల పక్కన గడ్డి పెరగకుండా చూసుకుంటే ఈ సమస్య ఉత్పన్నం కాదు. మొక్కలు కాలిపోతుంటే ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు ఏం చేస్తున్నట్లు?
– వడ్డె రాములు, మాజీ సర్పంచ్, ఆర్కతల
మొక్కలు కాపాడుతాం
రోడ్లకు ఇరువైపులా మొక్కలతో పాటు గడ్డి పెరిగి ఎండిపోయింది. ఎవరో ఒకరు గడ్డిని తగులబెట్టడంతో గడ్డితో పాటు మొక్కలు కాలిబూడిదవుతున్నాయి. ఇక నుంచి అలా జరగనివ్వం. ప్రస్తుతంఉపాధిహామీ పనులకు కూలీలు వస్తున్నారు. అదే కూలీలతో అన్ని గ్రామాల్లో రోడ్ల పక్కన ఉన్న ఎండిన గడ్డిని తీపిస్తాం. మొక్కలు కాపాడతాం.
– అనురాధ, ఎంపీడీఓ, నవాబుపేట

లెక్కల కోసమే నాటడం

లెక్కల కోసమే నాటడం