అనంతగిరి: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను సత్వరం పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని అన్ని వసతి గృహ వార్డెన్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి మంచి వాతావరణంలో విద్యార్థులు చదువుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే భవన లీకేజీలు, కిటికీలు, తలుపులను బాగు చేయించినట్లు చెప్పారు. అనంతరం హాస్టళ్ల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్‌డీఏ శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి మల్లేశం, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఉపేందర్, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్