
చిన్నారికి ప్రాణం పోసిన వైద్యులు
బీచ్‌రోడ్డు: ఊపిరితిత్తుల్లో చిక్కుకున్న చెట్టు కొమ్మ ముక్కను తొలగించి ఆరు నెలల బాబుకు ప్రాణం పోశారు మెడికవర్ వైద్యులు. ఒడిశాకు చెందిన ఆరు నెలల శిశువు తక్కువ రక్త ఆక్సిజన్ స్థాయి (60 శాతం)తో విషమ స్థితిలో ఉండగా వెంకోజీపాలెంలో గల మెడికవర్ హాస్పిటల్‌లో చేర్పించారు. డాక్టర్ హేమంత్, డాక్టర్ లక్ష్మణ్ నేతృత్వంలోని బృందం వెంటనే శిశువును బ్రాంకోస్కోపీ సూట్‌కు తరలించారు. శిశువు ఊపిరితిత్తుల్లో చెట్టు కొమ్మ ముక్క చిక్కుకున్నట్లు కనుగొన్నారు. దీనివల్ల వాయుమార్గం పూర్తిగా అడ్డంకిగా మారింది. వైద్య బృందం 10 నిమిషాల్లోనే బ్రాంకోస్కోపీ బాస్కెట్‌ని ఉపయోగించి ఆ కొమ్మ ముక్కను విజయవంతంగా తొలగించారు. శిశువుకు ఆక్సిజన్ స్థాయి మెరుగుపడింది. మరుసటి రోజే ఆ చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆ తల్లిదండ్రులు వైద్యులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఊపిరితిత్తుల్లో చెట్టు కొమ్మ ముక్క తొలగింపు

చిన్నారికి ప్రాణం పోసిన వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment