● ఒకే రూపం.. అపురూపం
డాబాగార్డెన్స్: ఒకే పోలికతో ఉన్న ఇద్దరు కవలలు కనిపిస్తే ఒకింత వింతగా చూస్తాం. అదే ఒకేసారి 50 మంది కవలలు కనిపిస్తే సంభ్రమాశ్చర్యానికి గురవుతాం కదా. కవలల దినోత్సవం సందర్భంగా నగరంలోని ఓ హోటల్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 50 మంది కలుసుకున్నారు. ఇలా వీరిని చూసిన వారంతా భలే ఉన్నారే.. అంటూ ముచ్చటపడ్డారు. ఒకే రూపంలో ఉన్న ఇద్దర్ని గుర్తుపట్టలేక తికమకపడ్డారు. ఎంతో సందడిగా కవలల దినోత్సవాన్ని నిర్వహించిన విశాఖకు చెందిన రామ్–లక్ష్మణ్, సోంపేటకు చెందిన రామరాజు–లక్ష్మణ రాజును ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment