ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల వలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ (వీఆర్‌ఎస్) జాబితాకు ఆమోద ముద్ర పడింది. దీంతో వీఆర్‌ఎస్‌పై ఉత్కంఠ తొలగిపోయింది. మొత్తం 1,126 మంది వీఆర్‌ఎస్‌కు అర్హత సాధించారు. 79 మంది దరఖాస్తులు తిరస్కరించారు. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం జారీ చేసిన వీఆర్‌ఎస్ స్కీమ్‌లో భాగంగా ఈ నెల 19న నాన్ వర్క్స్‌కు చెందిన కార్మికులతో పాటు ఈ 4 స్థాయి వరకు అధికారుల జాబితా ప్రకటించారు. అప్పటి నుంచి వర్క్స్, నాన్ వర్క్స్‌లకు చెందిన ఈ 5, అంతకన్నా పైస్థాయి అధికారుల జాబితా పెండింగ్‌లో ఉంది. దీంతో దరఖాస్తు చేసిన వారు ఆ జాబితా కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సీఎండీ ఆఫైల్‌కు శనివారం ఆమోదం తెలిపారు. ఈ జాబితాలో 231 మందికి చోటు లభించింది. ఇదిలా ఉండగా తిరస్కరణకు గురైన వారికి ఈనెల 22 వరకు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. వాటిని మరో పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఆమోదం తెలిపిన ఉక్కు సీఎండీ
Comments
Please login to add a commentAdd a comment