● నేడు 16 కేంద్రాల్లో పరీక్ష ● హాజరుకానున్న 11,029 మంది..
మహారాణిపేట: గ్రూప్–2 పరీక్షకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 16 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షకు మొత్తం 11,029 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఉదయం 9.45 తర్వాత, మధ్యాహ్నం 2.45 తర్వాత వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రతి కేంద్రంలో నిర్దేశించిన సమయానికి సిబ్బంది చేరుకోవాలని కోరారు. పరీక్షల నిర్వహణ కోసం కోఆర్డినేషన్ ఇన్‌చార్జిగా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌ను నియమించారు. పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ఆందోళన చేస్తుండడంతో కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాటు చేశారు.
ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు
పరీక్షల కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం లేదు. బబ్లింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, కొట్టివేతలకు తావివ్వరాదని, వైటనర్ వినియోగించరాదని అధికారులు సూచించారు. ఇన్విజలేటర్లు నిబంధనలు పాటించాలని, పరీక్షకు ఐదు నిమిషాల ముందు మాత్రమే సీల్డ్ కవర్లో ఉన్న ప్రశ్నా పత్రాలను ఇవ్వాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment