
ఈపీడీసీఎల్‌తో స్వానిటీ ఒప్పందం
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్తు సరఫరా, సౌర విద్యుత్‌కు సంబంధించిన అంశాలపై అవసరమైన సాంకేతిక సహకారాన్ని తీసుకునేలా స్వానిటీ ఇనీషియేటివ్‌తో ఏపీఈపీడీసీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి సమక్షంలో సంస్థ ఎనర్జీ కన్సర్వేషన్ విభాగం సీజీఎం జె.శ్రీనివాసరావు సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో స్వానిటీ ఇనీషియేటివ్ సంస్థ ట్రస్టీ ఉమ భట్టాచార్య ఎంవోయూపై శనివారం సంతకాలు చేశారు. ఏపీఈపీడీసీఎల్‌లో అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, ఫీడర్ స్థాయిలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లు, డిస్ట్రిబ్యూటెడ్ బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఉచితంగా అందించేందుకు అమెరికాకు చెందిన స్వానిటీ ఇనీషియేటివ్ సంస్థ ముందుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment