అ
వ్వాతాతలకు
గచాట్లు
సాక్షి, విశాఖపట్నం: ఏడాది కాలంలో ఎంత తేడా? గతేడాది మార్చిలో ఒకటో తేదీ ఉదయాన్నే.. కోడి కూయకముందే అవ్వా.. తాతా.. అనే పిలుపు వినిపించిన విషయం గుర్తే ఉంటుంది. ఇంటి దగ్గరకు వచ్చిన పింఛన్ డబ్బులతో పండుటాకుల కళ్లల్లో ఆనందం కనిపించేది. మరి ఇప్పుడో.! ఒకటో తేదీ వచ్చిందన్న సంతోషం పింఛనుదారుల్లో మోము ల్లో వికసించడం లేదు. పింఛన్‌ను కానుకగా అందుకున్న రోజులు పోయాయి. కాసుల కోసం వీధి చివర కాపాలా కాసే రోజులను తీసుకొచ్చేసింది కూటమి ప్రభుత్వం. అంతేనా? 9 నెలల్లో ఏకంగా 5,861 మంది పింఛన్లు తొలగించేసింది. గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా వెలగబెట్టిన చంద్రబాబు అవ్వాతాతల విషయంలో ఎలా దుర్మార్గంగా వ్యవహరించారో.. ఇప్పుడూ అదే తీరు కనబరుస్తున్నారు. గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఒకటో తేదీ ఉదయాన్నే వలంటీర్లు తలుపు తట్టి మరీ లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. లబ్ధిదారులకు ఎలాంటి కష్టం రాకుండా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల నుంచి.. పండుటాకుల వరకు పింఛను పొందేందుకు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు.
మేం చెప్పిన చోటికి వస్తేనే పింఛన్
సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇస్తారంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రగల్భాలు పలికారు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. లబ్ధిదారుల ఇంటికి వచ్చే ప్రసక్తే లేదని.. తాము చెప్పిన చోటికి వస్తేనే పింఛను డబ్బులు ఇస్తామని సిబ్బంది తెగేసి చెబుతున్నారు. లేదంటే తమ చుట్టూ పింఛను కోసం తిరగాల్సిందేననే విధంగా వ్యవహరిస్తున్నా రు. దీంతో సిబ్బంది చెప్పిన చోటకు లబ్ధిదారులు వెళ్లి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వీధి చివరిలో.. మూడు నాలుగు వీధుల చివర్లో పింఛను కోసం ఉదయం నుంచి వేచి చూస్తున్నారు. ఉదయం 7 గంటలకు వెళ్లి ఎండలో పడిగాపులు కాస్తుంటే.. తీరిగ్గా సిబ్బంది వచ్చి.. స్కూటీ, బైక్ దిగకుండానే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.
9 నెలల్లో 5,861 మంది పింఛన్ల కోత
2014లో అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీల పేరిట ఉన్న పెన్షన్లకు టీడీపీ ప్రభుత్వం ఎలా కోత విధించిందో.. ఈ సారీ అదే సీన్ రిపీట్ అవుతోంది. 2024లో ఎన్నికల నోటిఫికేషన్ సమయానికి గత మార్చిలో విశాఖ జిల్లాలో 1,65,891 మంది పింఛనుదారులుండేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత జూలైలో మొదటిసారి పింఛను పంపిణీ చేసిన సమయానికి 1,64,150 మందికి మాత్రమే పింఛను ఇచ్చారు. అంటే మొదటి నెలలోనే 1,741 మందికి కోత విధించారు. 9 నెలలు తిరిగే సరికి ప్రస్తుతం 1,60,030 మందికి మాత్రమే పింఛన్లు మంజూరు చేస్తున్నారు. అంటే అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో ఏకంగా 5,861 పింఛన్లకు కోత విధించారు. దీని వెనుక స్థానిక టీడీపీ నేతల హస్తం ఉన్నట్లు సమాచారం. తమకు అనుకూలంగా లేని వారిని గుర్తించి.. వారి పేర్లను పింఛన్ల జాబితా నుంచి ప్రతి నెలా తొలగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్చిలో 1,60,030 మంది పింఛనుదారులుండగా.. శనివారం తుది సమాచారం మేరకు 95.84 శాతం మందికి పింఛన్ అందజేశారు. 1,53,378 మందికి రూ.66.60 కోట్లు పంపిణీ చేశారు.
నాడు ఇంటి వద్దే.. నేడు వీధి చివరలో..!
నడి రోడ్డుపై నిలబెట్టి పండుటాకులకు పింఛన్లు
లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వ సిబ్బంది
చెప్పిన చోటికి వచ్చి సొమ్ము తీసుకోవాలంటూ హుకుం
9 నెలల్లోనే జిల్లాలో 5,861 మంది పింఛన్లకు కోత
అ
Comments
Please login to add a commentAdd a comment