ట్రంప్ వల్ల జెలెన్‌స్కీకి ప్రాణహాని
● ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
సీతమ్మధార: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య వైట్‌హౌస్‌లో జరిగిన వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని ఆశీలమెట్టలో గల తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మా ట్లాడుతూ.. వైట్‌హౌస్‌లో ఇదివరకు ఎప్పుడూ ఇటువంటి మాటల యుద్ధం జరగలేదని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఈ సంఘటనపై జెలన్‌స్కీకి ట్రంప్ క్షమాపణ చెప్పాలని పాల్ సూచించారు. జెలన్‌స్కీకి ప్రాణహాని ఉందని, దానికి ట్రంప్ బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ వివాదం ఇక్కడితో ఆగకపోతే ప్రపంచయుద్ధం మొదలయ్యేది రష్యాతో కాదని, చైనా మొదలుపెడుతుందని సంచలన వాఖ్యలు చేశారు. ప్రపంచశాంతి నెలకొల్పేందుకు ప్రజాశాంతి పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు మార్చి మూడోవారంలో అమెరికా వెళ్లనున్నట్లు పాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment