● స్టాఫ్ నర్సులకు మెమోలు ● కేజీహెచ్‌లో శిశువుల తారుమారు ఘటన
డాబాగార్డెన్స్: కేజీహెచ్ గైనిక్ విభాగంలో శిశువుల తారుమారు ఘటనకు సంబంధించి థియేటర్ అసిస్టెంట్ డి.రామాను సస్పెండ్ చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఏడుగురు అధికారులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. విచారణ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు థియేటర్ అసిస్టెంట్ డి.రామాను సస్పెండ్ చేయడంతో పాటు, విధి నిర్వహణలో ఉన్న స్టాఫ్ నర్సులకు మెమోలు జారీ చేసినట్లు డాక్టర్ శివానంద్ తెలిపారు. ఆపరేషన్ థియేటర్లలో పనిచేస్తున్న థియేటర్ అసిస్టెంట్లు, నాల్గో తరగతి ఉద్యోగులు, విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే స్టాఫ్ నర్సులను మార్పు చేయాలని డీసీఎస్‌ఆర్‌ఎంవో మెహర్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. ఈ తరహా ఘ టనలు, తొందరపాటు చర్యలు జరగకుండా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
నకిలీ డాక్టర్లతో సంబంధం లేదు
రూ.లక్షకే కిడ్నీ ఇస్తామని మోసగించిన నకిలీ డాక్టర్ల విషయమై కేజీహెచ్‌కు ఎటువంటి సంబంధం లేదని సూపరింటెండెంట్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇది బయట వ్యక్తులు చేసిన మోసమని, ప్రజలు అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దన్నా రు. ఇలాంటి సమాచారం ఎవరైనా ఇస్తే.. కమాండ్ కంట్రోల్, కలెక్టర్ కార్యాలయ హెల్ప్‌లైన్ నంబర్లు 0891–2590100, 2590102కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కేజీహెచ్‌లోని వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారా మెడికల్, క్లాస్–4 ఉద్యోగులు, ఏ ఇతర సిబ్బంది కూడా ఇటువంటి చర్యలకు పాల్పడరని, అవయవ దానం అనేది జీవన్‌దాన్ అనే సంస్థ ద్వారా మాత్రమే జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment