పరీక్షలు ఆరంభం
● ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు95 శాతం హాజరు ● పలుచోట్ల ఆలస్యంగా ప్రశ్నాపత్రం ● రేపు సెకండ్ ఇయర్ పరీక్షలు
ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025
ఇఫ్తార్ సహార్
ఆది సోమ
6.07 5.00
సింహాచలం ఇన్‌చార్జి ఈవో బాధ్యతల స్వీకరణ
విశాఖ విద్య : జిల్లాలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. 87 కేంద్రాల్లో తొలిరోజు సెకండ్ లాంగ్వేజి (తెలుగు/ సంస్కృతం) పరీక్ష జరిగింది. విద్యార్థులను కేంద్రాల్లోకి అరగంట ముందు నుంచే అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తొలిరోజు కావడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కేంద్రాల వద్దకు తోడుగా వచ్చారు. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడిగా కనిపించింది. కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీటి వసతి కల్పించారు. అన్ని కేంద్రాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆర్‌ఐవో పి.మురళీధర్ నగరంలోని పలు కేంద్రాలను తనిఖీ చేసి, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.
ఆలస్యంగా ప్రశ్నాపత్రం
తొలిరోజు కొన్ని కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తాయి. గోపాలపట్నం ఎస్‌వీఎల్‌ఎన్‌ఎస్ విద్యాపీఠ(అల్వార్ దాస్) కాలేజీలో విద్యార్థులకు అరగంట ఆలస్యంగా ప్రశ్నాపత్రం ఇచ్చినట్లు విద్యార్థులు చెబుతున్నారు. పోలీసు స్టేషన్ నుంచి ప్రశ్నాపత్రాలు ఆలస్యంగా తీసుకురావటం వల్లనే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రం ఆలస్యం ఇచ్చిన దృష్ట్యా ఇక్కడ అదనంగా విద్యార్థులకు 30 నిమిషాలు సమయం కేటాయించారు. మధురవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల, తగరపువలసలోని ఓ కాలేజీలో 10 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నాపత్రం ఇచ్చి, విద్యార్థులకు అదనంగా అదే సమయాన్ని కేటాయించారు.
95 శాతం హాజరు
ఇంటర్ ఫస్టియర్ జనరల్ కోర్సు 41,945 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వీరిలో 1,945 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 1,741 మందికి గాను 107 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 43,686 మంది విద్యార్థులకు గాను 41,634 మంది పరీక్షకు హాజరయ్యారు. 95 శాతం మంది పరీక్ష రాసినట్లు ఇంటర్మీడియెట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి పి.మురళీధర్ వెల్లడించారు. పరీక్షల్లో ఎటువంటి మాస్‌కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆర్‌ఐవో కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి అధికారులు పర్యవేక్షణ చేశారు. తొలిరోజు ఎటువంటి మాస్ కాపీయింగ్ కేసులు నమోదు కాలేదు.
పరీక్ష రాసి వచ్చే తమ పిల్లల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు
రేపటి నుంచి సెకండియర్ పరీక్షలు
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 40,744 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. బాలురు 21,464 మంది, బాలికలు 19,280 మంది ఉన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది.
న్యూస్‌రీల్
పరీక్షలు ఆరంభం
పరీక్షలు ఆరంభం
పరీక్షలు ఆరంభం
పరీక్షలు ఆరంభం
పరీక్షలు ఆరంభం
పరీక్షలు ఆరంభం
పరీక్షలు ఆరంభం
పరీక్షలు ఆరంభం
పరీక్షలు ఆరంభం
Comments
Please login to add a commentAdd a comment