‘టీసీపీసీ’ భూముల పరిశీలన
మధురవాడ/ఏయూక్యాంపస్: బక్కన్నపాలెంలోని రాష్ట్ర ప్రభుత్వ వయోవృద్ధులు, వికలాంగుల సహాయ సంస్థ శిక్షణ, ఉత్పత్తి కేంద్రం(టీసీపీసీ)కి చెందిన భూములు, దాని పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను మంగళవారం కేంద్ర సామాజిక న్యాయ శాఖ డైరెక్టర్ వినీత్ సింఘాల్, ఏఎస్‌వో రాహుల్ కుమార్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ డైరెక్టర్ రవి ప్రకాష్ రెడ్డి, జాయంట్ కలెక్టర్ మయూర్ అశోక్ పరిశీలించారు. ఇక్కడ దివ్యాంగుల క్రీడా స్టేడియం నిర్మాణ ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో సర్వే నంబర్ 92లో సుమారు 22 ఎకరాలు, దానికి ఆనుకుని నవోదయ వెనుక, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొమ్మాది ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు పరిశీలించారు. ఇక్కడ ఎంత భూమి అందుబాటులో ఉంది? ఇందులో స్టేడియం నిర్మాణానికి ఎంత అవసరం? అందుకు అనువుగా ఉందా లేదా అన్న విషయాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు మాధవి, తహసీల్దార్ కిరణ్, ప్రిన్సిపాల్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులు ప్రభుత్వ అంధ బాలికల పాఠశాల(ఎండాడ), పెందుర్తిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు.
బక్కన్నపాలెంలో పారా స్టేడియం ప్రతిపాదన
Comments
Please login to add a commentAdd a comment