మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
మహారాణిపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురజాడ కళాక్షేత్రం వేదికగా ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ శాఖల మహిళలకు క్రీడా పోటీలు, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వ, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మహిళా సంఘాలు, ఎన్జీవోలను భాగస్వామ్యం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎంఎస్‌ఎంఈ రుణాల మంజూరుపై బ్యాంకర్లు దృష్టి సారించాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య, పోలీస్, గ్రామీణ పేదరిక నిర్మూలన, విద్యాశాఖ తదితర శాఖలు సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment